పాకిస్థాన్ సూపర్ లీగ్ లో వింతలకు కొదువ లేదు. వీరు చేసే పనులకు, వేషాలకు ప్రపంచ క్రికెట్ సైతం షాక్ అవుతుంది. ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్న 2024 సీజన్ లో కొన్ని పనులతో ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. తాజాగా అలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఇస్లామాబాద్ యునైటెడ్ స్టార్ ఆల్ రౌండర్ ఇమాద్ వాసిమ్ స్మోకింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ ఫైనల్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.
నిన్న(మార్చి 18) ముల్తాన్ సుల్తాన్స్, ఇస్లామాబాద్ యునైటెడ్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఇమాద్ వసీమ్ తన బౌలింగ్ తో అదరగొట్టాడు. ఈ మ్యాచ్ లో ఏకంగా 5 వికెట్లు పడగొట్టి ముల్తాన్ భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నాడు. యాసిర్ ఖాన్, డేవిడ్ విల్లీ, జాన్సన్ చార్లెస్, ఖుష్దిల్ షా, క్రిస్ జోర్డాన్ వికెట్లను తీసుకున్నాడు. ఇక ముల్తాన్ సుల్తాన్ ఇన్నింగ్స్ ముగింపు దశలో ఇమాద్ డ్రెస్సింగ్ రూమ్ ముందు ఎంచక్కా స్టైల్ గా స్మోక్ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఇది చూసిన నెటిజన్స్ ఈ ఆల్ రౌండర్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఎంత స్టార్ బౌలర్ అయినా వ్యక్తిత్వం సరిగా ఉండాలని ట్రోల్స్ చేస్తున్నారు.
ALSO READ :- Vijay Thalapathy: కారును వెంబడించిన ఫ్యాన్స్.. విజయ్ చేసిన పనికి నెటిజన్స్ ఫిదా
అత్యంత ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో ఇస్లామాబాద్ యునైటెడ్ చివరి బంతికి నెగ్గి పాకిస్థాన్ సూపర్ లీగ్ టైటిల్ ను గెలుచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. 57 పరుగులు చేసిన ఉస్మాన్ ఖాన్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. లక్ష్య ఛేదనలో ఇస్లామాబాద్ యునైటెడ్ చివరి బంతికి ఒక పరుగు కావాల్సిన దశలో ఫోర్ కొట్టి గెలిచింది. న్యూజిలాండ్ మాజీ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ 50 పరుగులు చేసి జట్టుటైటిల్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు.
What a disgraceful act….👎#HBLPSLFinal #PSLFinal #ImadWasim #MSvIU
— Nawab Naeem Sial (@NawabNaeem8058) March 18, 2024
pic.twitter.com/jSJZk8otMu